Tuesday, 5 April 2011

నిజం
ఓ ప్రేమ.....!!!
నీతో కాసేపు మాట్లాడాలని ఉంది.
వీలయితే కొన్ని ప్రశ్నలు కూడా అడగాలని ఉంది.
ప్రపంచంలో అందరూ నిన్ను
'నిస్వార్థ భావన' అని అంటారు
మరి నా విషయంలో ఎందుకంత
'స్వార్థంగా' ప్రవర్తించావు ???
నిజం మాట్లాడడమే నేను
చేసిన తప్పా ???
అంటే ప్రేమలో నిజాలు ఉండవా ??? 
అవును, నిజం మాట్లాడడం
ఈ ప్రపంచంలో పెద్ద నేరమే...!!!
అందుకే అన్నారేమో పెద్దలు
"నిజం నిప్పులాంటిదని"
మరి ఆ నిజం
నిన్ను నిలువునా కాల్చేస్తే,
మన ప్రేమను నిలువునా కుల్చేస్తే,
నన్ను మాత్రం 'మనిషి'గా మలిచింది. 
అందుకే నాకు నీ 'ప్రేమ' కన్నా ముఖ్యం  
ఒక మనిషిగా ఉండడమే  
మంచి మనిషిగా...!!!   
నీ అబద్దపు ప్రేమ కోసం  
నా నిజమైన జీవితాన్ని వదులుకోను.
వదులుకోను..... వదులుకోను.....!!!    
-కొండ్ర రవికుమార్ ఎం.ఏ., (ఎం.ఫిల్)

No comments:

Post a Comment